మన్యం న్యూస్ దుమ్మగూడెం సెప్టెంబర్ 11::
అంగన్వాడి టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి గ్రాటిటీ చట్టం అమలు చేసి వారి సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి డిమాండ్ చేశారు. సోమవారం మండల పరిధిలోని లక్ష్మీనగరం గ్రామంలో అంగన్వాడీ టీచర్లు సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు . ఈ సందర్భంగా సిఐటియు బ్రహ్మచారి, ఏఐటీయూసీ నాయకులు రామిరెడ్డి మాట్లాడుతూ టీచర్లకు హెల్పర్లకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ చట్టాన్ని అమలు చేయాలని మినీ అంగన్వాడి కేంద్రాలను ఎటువంటి సరుకులు లేకుండా మెయిన్ అంగన్వాడీ కేంద్రంలో ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం ఇన్సూరెన్స్ రిటర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరుతూ సమ్మెబాట చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ చిలకమ్మ, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు కృష్ణవేణి, కమలాదేవి, గజలక్ష్మి, బుచ్చమ్మ, ఆదిలక్ష్మి, ఏఐటియుసి నాయకురాలు రత్నకుమారి, లక్ష్మి, మండలంలోని అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు సమ్మెలో పాల్గొన్నారు.