మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబర్ 11::
బహుజన సమాజ్ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని జిల్లా బీఎస్పీ అధ్యక్షులు ఇర్పా రవికుమార్ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని బహుజన సమాజ్ పార్టీ విస్తృత పర్యటన చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు రవికుమార్ ఇంచార్జ్ రఘు పాల్గొని మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు సీఎం కావాలని ప్రజలు తెలుసుకోవాలని తెలంగాణ రాష్ట్రం సుపరి పరిపాలన రావాలంటే బి ఎస్ పి పార్టీని గెలిపించాలని కోరారు. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు సీఎం కావాలి కరపత్రాలను విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కంచర్ల సింహాద్రి, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి దామోదర, సోడి వీరస్వామి, నరసింహారావు, నరేష్, తదితరులు పాల్గొన్నారు.