పినపాక నియోజకవర్గం అభివృద్దే లక్ష్యం
అన్ని వర్గాల ప్రజలకు ఆత్మగౌరవ భవనాలు
2 కోట్ల రూపాయలతో ఎస్సీ సంఘం,కమ్మ సంఘం,పెరిక సంఘం భవన లకు శంకుస్థాపన
రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు,ఎమ్మెల్సీ తాతా మధు
మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం లోని గుట్టమల్లారం గ్రామంలో సిఎస్ఆర్ నిధుల నుండి సుమారు 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఎస్సి సంఘం ప్రజల ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాత మధు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎస్సీ కమ్యూనిటీ సభ్యులు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు,ఎమ్మెల్సీ తాతా మధు ను శాలువాతో ఘనంగా సత్కరించారు.అనంతరం లంక మల్లారం గ్రామంలో ఒక కోటి రూపాయల అంచనా వ్యయం తో నిర్మిస్తున్న కమ్మ సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ తాత మధు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా స్థలదాత అయిన పోశం పుల్లయ్య,ధనమ్మ దంపతులను శాలువాలతో ఘనంగా సత్కరించి,వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఉడతనేని గుంపులో 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న పెరిక సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు,ఎమ్మెల్సీ తాత మధు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మాట్లాడుతూ, సుమారు 2 కోట్ల రూపాయల తో నేడు ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపనలు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని కులాలకు అన్ని మతాల వారికి సమన్యాయం చేయడం జరుగుతుందన్నారు.ప్రతి ఒక్కరి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ,ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి బిఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.హైదరాబాద్ నడిబొడ్డున బంజారా భవన్, కొమరం భీమ్ భవన్ లను అత్యంత ప్రతిష్టాత్మకంగా సీఎం కేసీఆర్ నిర్మించడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో నేడు ఎస్సీలకు కమ్మ సంఘం వారికి పెరిక సంఘం వారికి ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగిందన్నారు.అన్ని కులాల వారికి,అన్ని మతాల వారికి కూడా ఆత్మగౌరవ భవనాలకు కేటాయించడం జరిగిందని తెలిపారు.బిఆర్ఎస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యమని, సీఎం కేసీఆర్ పరిపాలనలోని అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారన్నారు.సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ అన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని వారు స్పష్టం చేశారు.ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ యే తెలంగాణకు శ్రీరామ రక్షా అని వారు తెలిపారు.నాడు ఉద్యమం నుంచి మొదలుకొని 10 సంవత్సరాల కాలంలో తెలంగాణలో అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం కోసం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు,వారి ఆత్మగౌరవ భవనాలను నిర్మించాలని గొప్ప నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. రాష్ట్రంలోని రైతాంగని కాపాడుకోవడం కోసం రైతుబంధు,రైతు బీమా,ఉచిత కరెంటు,ఉచిత ఎరువుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టి,తాగునీరు,సాగునీరు అందజేసి వ్యవసాయంలో దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది అన్నారు.విద్యా, వైద్యం,ఐటి అన్ని రంగాలలో అద్భుతమైన ఫలితాలను సాధించి,నేడు దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు.రాబోయే ఎన్నికలలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని,ఎమ్మెల్యే రేగా కాంతారావును గెలిపించి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్ రావు, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు మణుగూరు జడ్పిటిసి పోశం. నరసింహారావు,ఎంపీపీ కారం విజయకుమారి,పీఏసీఎస్ చైర్మన్ నాగేశ్వరరావు, ఎంపీటీసీల జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు,స్థానిక ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు పా ర్టీ ముఖ్య నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.