UPDATES  

 గులాబీ దండు ఒక్కటై కదిలింది

గులాబీ దండు ఒక్కటై కదిలింది
*ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు.
*నాగజ్యోతిని ఆశీర్వదించి గెలిపించండి.
*ములుగు జిల్లా అధ్యక్షులు కాకుల మర్రి లక్ష్మణ్ బాబు.
మన్యం న్యూస్ ఏటూరు నాగారం
ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ నూతన జిల్లా అధ్యక్షులు హోదాలో కాకులమర్రి లక్ష్మణ్ బాబు,బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి ఇరువురికిసోమవారం ఏటూరు నాగారం వచ్చిన శుభ సందర్భంగా
గులాబీ శ్రేణులు, అబిమానులు ఘన స్వాగతం పలికారు.డప్పు చప్పుళ్ళు హారతులు కోలాటలతో మహిళలు బొట్టు పెట్టి ఘన స్వాగతం పలికారు.
చిన్న బోయిన పల్లి నుండి ఏటూరు నాగారం వరకు గులాబీ శ్రేణులు బైక్ ర్యాలీ తీశారు.గులాబీ దండు ఒక్కటై కదిలింది.రాబోయే ఎన్నికల్లో ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి విజయంతో గులాబీ దండు యొక్క దమ్ము చూపిస్తాం ముఖ్యమంత్రి కేసీఆర్ కి విజయాన్ని కానుకగా అందిస్తామని గులాబీ దండు యాత్ర ప్రజల ఆశీర్వాదాలతో సాగింది.తాళ్లగడ్డ ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడి కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరాహార దీక్ష చేపట్టగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జడ్పీ చైర్ పర్సన్ నాగజ్యోతి వారి వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అంగన్వాడీ కార్యకర్తలు గృహలక్ష్మి పథకానికి అర్హులని విడతలవారీగా అంగన్వాడీలకు ప్రతి ఒక్కరికి గృహలక్ష్మి ద్వారా ఇల్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.అనంతరం యాత్ర మండల కేంద్రంలోని వై జంక్షన్ వద్దకు చేరుకోవడంతో బతుకమ్మలతో తెలంగాణ సాంప్రదాయ బద్ధంగా. జోగినీలు యాత్రకు స్వాగతం పలికి ఎమ్మెల్యే అభ్యర్థి నాగజ్యోతికి తిలకం దిద్ది ఆశీర్వదించారు.బస్టాండ్ కేంద్రంలో తెలంగాణ తల్లి. జయశంకర్ విగ్రహం. అమరవీరుల స్థూపానికి.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.యాత్ర ఓడ వాడ చివరి వరకు ఘనంగా సాగింది.అనంతరం మండల కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో అభినందన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఆయా గ్రామాల వారిగా పార్టీ అధ్యక్షులు పలువురు ప్రజాప్రతినిధులు నూతన జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ను శాలువాలతో ఘనంగా సన్మానించారు.అనంతరం పాత్రికేయుల సమావేశంలో నూతన జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ.ఏటూరు నాగారం మండల కేంద్రంలోని వై జంక్షన్ ప్రాంతాన్ని హనుమాన్ జంక్షన్ గా ఏర్పాటు చేయడం కోసం ఇప్పటికే గ్రామ పెద్దలతో సంప్రదింపులు జరపడం జరిగిందని అన్నారు. హనుమాన్ జంక్షన్ గా నామకరణం చేయడం కోసం
వై జంక్షన్ ప్రాంతంలో 20 అడుగుల ఎత్తులో హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నాలు చేపట్టినట్లు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.13వ వార్డు నెంబర్ కన్నూరి సుజాత ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో మృతి చెందడం చాలా బాధాకరమని తమ పార్టీ వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు.బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని,ప్రభుత్వ సంక్షేమ పథకాలే మన ఆడబిడ్డ అడవి బిడ్డ ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబ నేపథ్యం కలిగిన బడే నాగజ్యోతి ని ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించి కెసిఆర్ కు కానుకగా అసెంబ్లీకి పంపించే విధంగా ప్రతి ఒక్కరు నాగ జ్యోతిని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ములుగు జడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి,జడ్పీ కో ఆప్షన్ సభ్యురాలు వలియాబి,రైతు జిల్లా సమితి అధ్యక్షులు పల్ల బుచ్చయ్య,ఎంపీపీ అంతటి విజయ నాగరాజు,సర్పంచ్ ఈసం రామ్మూర్తి,సొసైటీ చైర్మన్ కూనూర్ అశోక్,ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య,మండల పార్టీ అధ్యక్షులుగడదాసు సునీల్ కుమార్,సీనియర్ నాయకులు తుమ్మల మల్లారెడ్డి,సర్దార్ పాషా,ఖాజా పాషా,ఎంపీటీసీ కోట నరసింహులు,చంద్రబాబు, భోజరావు, దన్నపునేని కిరణ్ కుమార్,ప్రదీప్ రావు,మాదరి రామయ్య,కొమిరి రమేష్, మండల అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు,మహిళ అధ్యక్ష కార్యదర్శులు యూత్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !