UPDATES  

 కేంద్రంలో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషించబోతుంది:ఎంపీ రవిచంద్ర

కేంద్రంలో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషించబోతుంది:ఎంపీ రవిచంద్ర
ఇల్లందుకు విచ్చేసిన ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు అపూర్వస్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు*

డోలు వాయిద్యాలు, గిరిజన నృత్యాలతో మర్మోగిన ఇల్లందు

దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా కేసీఆర్ తెలంగాణను తీర్చిదిద్దారు:ఎంపీ రవిచంద్ర

ఇల్లందు తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదింది:ఎంపీ రవిచంద్ర

హరిప్రియ హయాంలో ఇల్లందు అభివృద్ది చెందింది వచ్చే ఎన్నికలలో హరిప్రియ విజయఢంకా మోగించడం ఖాయం
మహబూబాద్ ఎంపీ మాలోత్ కవిత

మన్యం న్యూస్,ఇల్లందు:రానున్నకాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దేశప్రధాని అవుతారని అందుకు కావలసిన అన్ని అర్హతలు ఆయనకు ఉన్నాయని రాజ్యసభసభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కేసీఆర్ కి సుదీర్ఘ పాలనానుభవం, పాలనాదక్షత, అన్ని అంశాలపై లోతైన అవగాహన, వక్తృత్వ సామర్థ్యాలు ఉన్నాయని తెలిపారు. బీఆర్ఎస్ ఇల్లందు నియోజకవర్గ ఇంఛార్జిగా నియమితులయ్యాక సోమవారం తొలిసారిగా ఇల్లందుకు విచ్చేసిన ఎంపీ రవిచంద్రకు ఎమ్మెల్యే హరిప్రియ, లోక్ సభ సభ్యురాలు కవితల నేతృత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు అపూర్వస్వాగతం పలికారు. డప్పువాయిద్యాలు, లంబాడ, కోయ నృత్యాలు, కోలాటం, పటాకులు కాల్చుతూ రవిచంద్రకు ఘనస్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. రాజ్యసభసభ్యులు రవిచంద్ర రాకతో బీఆర్ఎస్ తోరణాలు, జెండాలు, ఫ్లెక్సీ హోర్డింగులతో ఇల్లందు నూతన శోభను సంతరించుకుంది. తొలుతగా ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్యే హరిప్రియ 24ఏరియాలోని అభన్నాంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యువతను, కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ 24ఏరియా నుంచి కొత్త బస్టాండ్, జగదాంబ సెంటర్ మీదుగా సుభాష్ నగర్ వరకు టపాసులు కాలుస్తూ భారీర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం జరిగిన సభలో వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ..రానున్న ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వాన బీఆర్ఎస్ ఘనవిజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. ఆ తర్వాత కేసీఆర్ దేశరాజకీయాలపై ప్రత్యేకదృష్టి పెట్టి పట్టు సాధిస్తారని, కేంద్రంలో కీలకపాత్ర పోషించనున్నారని జోస్యం చెప్పారు. కాలం కలిసివస్తే కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారని రవిచంద్ర పేర్కొన్నారు. అనితరసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గొప్ప రాజనీతిజ్ఞుడని, దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా బంగారు తెలంగాణగా మన రాష్ట్రం విరాజిల్లుతోందన్నారు. ఈ ఇల్లందు గడ్డ తెలంగాణ తొలిదశ ఉద్యమానికి ఊపిరులూదిందని, మలిదశ పోరాటంలోనూ అగ్రభాగాన నిలిచిందన్నారు. ఇక్కడ నుంచి పోటీచేసి ఓడిన నాయకుడిని కేసీఆర్ చేరదీసి జెడ్పీఛైర్మన్ పదవి కట్టబెడితే డబ్బు సంచులకు అమ్ముడుపోయాడని, వారి ఆటలు సాగనివ్వమని రవిచంద్ర స్పష్టం చేశారు. తానిక్కడకు పెత్తనం చేసేందుకు రాలేదని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా గులాబీ శ్రేణులను సమన్వయం చేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పంపితే వచ్చానన్నారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరిప్రియల అఖండ విజయం తథ్యమన్నారు. ఇందుకు మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలు, యువత తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !