బయ్యారం, మన్యం న్యూస్ :ఉన్న ఊరు కన్నతల్లి తో సమానం అంటారు.ఈ వ్యాక్యంతో ప్రేరణ పొందిన బయ్యారం1987-1988 పదవ తరగతి పూర్వ విద్యార్థులుఊరికి ఏదో ఒకటి చేయాలని తలంచారు. తమ స్వంత గ్రామానికి వైకుంఠ రథం విరాళం ఇచ్చి ఊరిపై ప్రేమ ను చాటారు. వివరాల్లోకి వెళ్లగా గ్రామంలో వైకుంఠ రధం( మహా ప్రస్థాన వాహనం)లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని వైకుంఠ రధాన్ని చేయూతగా ఇచ్చారు. దీనితో వారు చేసిన మంచి పనికి గ్రామంలోని ప్రజలందరూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు వీరోజు ఉపేంద్ర చారి, వాసిరెడ్డి సుదీర్, హాసన్, అజయ్, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.