మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
లక్ష్మిదేవిపల్లి మండలంలోని సెంట్రల్ పార్కులో సోమవారం నిర్వహించిన అటవీ అమరవీరుల దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడవుల సంరక్షణలో గుత్తి కోయల చేతిలో హత్యకు గురైన చలమల శ్రీనివాస రావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అడవుల సంరక్షణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులను శాలువాలతో సన్మానించారు. తర్వాత చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టి చెట్లను పరిరక్షించడంతోపాటు వాటిని సంరక్షించాలని కలెక్టర్ సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పి డాక్టర్ వినీత్, జిల్లా అటవీ అధికారి కిష్టా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.