మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబర్ 11::
పెండింగ్ లో ఉన్న సాగు భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని ఏ ఎస్ పి డివిజన్ అధ్యక్షుడు సోందే మల్లు దొర తెలిపారు. సోమవారం ఆదివాసి మండల కన్వీనర్ రేసు ఆదినారాయణమూర్తి ఆదివాసి రైతులతో కలిసి తాసిల్దార్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మల్లు దొర మాట్లాడుతూ ఏళ్లు తరబడి ఆదివాసి రైతులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని వారిని ఇబ్బంది పెట్టడం సరికాదని గిరిజనేతరులకు మాత్రం ఏజెన్సీ ప్రాంతంలో భూములపై హక్కు ఎలా కల్పిస్తారని అధికారులు ప్రశ్నించారు. గిరిజన రైతులను ఇబ్బంది పెట్టకుండా వారి దరఖాస్తులు ప్రకారం పట్టాలు మంజూరు చేసే దిశగా చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు నాగేశ్వరరావు, మురళి, రామచంద్రయ్య, వెంకటేశ్వర్లు, రైతులు సీతయ్య,కల్లూరి వరలక్ష్మి సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.