మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- ఇల్లందు మండలం సుదిమల్ల రైతు వేదికనందు పారా లీగల్ వాలంటీర్ సతీష్ కండేల్వాల్ అధ్వర్యంలో అగ్రి లీగల్ ఎయిడెడ్ క్లినిక్ అందించే న్యాయ సహాయ అవగాహన సదస్సు మంగళవారం జరిగింది. హనుమంతులపాడు, కొత్తూరు, సుదిమళ్ల గ్రామాలకు చెందిల పలువురు రైతులు ఈ సదస్సులో పాల్గొన్నారు. పిఎల్వి సతీష్ ఖండెల్వాల్ మాట్లాడుతూ గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న వ్యసాయ సంబంధిత జటిల సమస్యలకు సత్వర పరిష్కారం న్యాయసేవా కేంద్రం ద్వారా దొరుకుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కల్తీ పద్మ, రైతులు ఊకె సాయికుమార్, లక్ష్మీనారాయణ, సందీప్, మారుతి, నాగరాజు, సుదీర్, హేమంత్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.