మన్యం న్యూస్ చర్ల
ఆడపిల్లలు సమాజంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగి ఉన్నత స్థానాలకు చేరాలని దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు మద్దెల అన్నపూర్ణ అన్నారు. గురువారం చర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దిశ ఫౌండర్ బి.వి.రాజు ఆదేశాలతో కళాశాల ప్రిన్సిపల్ బండి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన మహిళా చట్టాలపై అవగాహన సదస్సులో పాల్గొన్న మద్దెల.అన్నపూర్ణ మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలపై బాలికలపై అఘాయిత్యాలు ఆకృత్యాలు పెరిగిపోతున్నాయని మహిళా చట్టాలను ప్రభుత్వాలు పటిష్టంగా అమలు చేయాలని అన్నారు. ఆడపిల్లలు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉండాలని తెలియజేశారు. నిర్భయ, దిశ వంటి చట్టాలు మహిళల రక్షణ కోసమే ఉన్నాయని కాబట్టి ధైర్యంగా ఉండాలని అన్నారు.బాలికలు ఆత్మస్థైర్యంతో ఉండాలని బేలతనం పనికిరాదని విద్యార్థినులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు శెట్టి ప్రసాద్,అమృతరావు, దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షురాలు పూజల లక్ష్మి,, జిల్లా జాయింట్ సెక్రెటరీ మాలతి, స్పోక్స్ పర్సన్ శారద, జిల్లా కమిటీ సభ్యులు నాగమణి,మంగ,చర్ల మండల కమిటీ అధ్యక్ష్య కార్యదర్శి లు వాడపల్లి శిరీష, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.