UPDATES  

 శ్రావణమాసం ఆఖరి వారం ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు…

శ్రావణమాసం ఆఖరి వారం ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు…
*జిల్లా నలుమూలల నుండి భక్తులు రావడంతో కిక్కిరిసిన ఆలయం
*అమ్మవారిని దర్శించుకున్న బీ. ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డా.తెల్లం వెంకట్రావు దంపతులు

మన్యం న్యూస్, దుమ్ముగూడెం సెప్టెంబర్ 12::
మండల పరిధిలోని దుమ్ముగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో శ్రావణమాసం ఆఖరి మంగళవారం కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. ప్రతి ఏట శ్రావణం మాసం ఆఖరి మంగళవారం ఆలయ కమిటీ వారు మహిళల కోసం ప్రత్యేకంగా పసుపు కుంకుమ జాకెట్టు ముత్తైదులకు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా నాలు మూలల నుండి మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ వారు భక్తుల కోసం ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న వెంకట్రావు
బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు దంపతులు ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన వారికీ కమిటీ వారు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి దంపతులు ఇరువురు మహిళలకు పసుపు, కుంకుమ, తాంబూలం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చుక్కా గణేష్ రెడ్డి, ఎంపీపీ రేసు లక్ష్మి, బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రాముడు, అధికార జానీపాషా, సర్పంచ్ జ్యోతి, భూపతి, యూత్ నాయకులు వెంకటేష్, గంగరాజు, శేఖర్, జయసింహ, సీనియర్ నాయకులు సీతారామారావు, లంక శివ, అర్జున్, భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !