కానిస్టేబుల్ కుటుంబానికి సహాయం
* 60 వేల చెక్కును అందించిన ఎస్పి
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఏఆర్ విభాగంలో విధులు నిర్వర్తిస్తూ అనారోగ్య కారణాలతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ టి.రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులకు 60 వేల రూపాయల చెక్కును మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ వినీత్.జి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అధికారులు సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల నిత్యం అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మరణించిన పోలీసులు కుటుంబాలకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం తరపున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను వీలైనంత త్వరలో వారికి అందేలా చర్యలు చేపట్టాలని పాల్గొన్న అధికారులకు తెలియజేశారు. ఈ నగదును కార్పస్ ఫండ్ నుండి అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయ ఏఓ జయరాజు, జిల్లా పోలీస్ అధికారుల సంఘము అధ్యక్షులు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఏసోబు, శ్రీనివాస్ సభ్యులు సుధాకర్, కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ మధు తదితరులు పాల్గొన్నారు.