UPDATES  

 టెట్ పరీక్షకు పగడ్బందీ ఏర్పాట్లు

టెట్ పరీక్షకు పగడ్బందీ ఏర్పాట్లు
* మాల్ ప్రాక్టీసెస్ కు అవకాశం లేకుండా చర్యలు
* జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్ కు అవకాశం లేకుండా పకడ్బందీగా టెట్‌ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న టెట్ పరీక్ష నిర్వహణపై మంగళవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో చీఫ్ సూపర్టెండెంట్లు డిపార్ట్ మెంటల్ అధికారులు రూట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో టెట్ పరీక్ష నిర్వహణకు 37 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్ష నిర్వహణకు సీటింగ్ ప్లాన్ తయారు చేయాలని చెప్పారు. ఈ నెల 15 తేదీ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు మొదటి పేపర్‌, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రెండో పేపర్‌ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఉదయం నిర్వహించే మొదటి పేపర్ పరీక్షకు 37 కేంద్రాలు, సాయంత్రం నిర్వహించే రెండో పేపర్ పరీక్ష నిర్వహణకు 29 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, భద్రాచలంలో ఏర్పాటు చేసిన 37 పరీక్షా కేంద్రాల్లో 8,717 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు చెప్పారు. కొత్తగూడెంలో 16 కేంద్రాలు, పాల్వంచ మున్సిపాలిటీలో 6 కేంద్రాలు, మణుగూరులో 8, భద్రాచాలంలో 7 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సాయంత్రం నిర్వహించే రెండో పేపర్ పరీక్షకు కొత్తగూడెంలో 16, పాల్వంచలో ఒకటి, మణుగూరులో 5, భద్రాచలంలో 7 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా 144 సెక్షన్‌ విధించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. టెట్ పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు ఏవైనా సలహాలు, సందేహాలు ఉంటే జిల్లా విద్యాశాఖ కార్యాలయపు హెల్ప్ డెస్క్ ను కానీ కంట్రోల్ రూము నంబర్ సాయి కృష్ణ 9396654181 నంబర్ కు కాల్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డిఆర్వో రవీంద్రనాధ్, డీఈఓ వెంకటేశ్వరచారి, పరీక్ష నిర్వహణ సహాయ కమిషనర్ ఎస్ మాధవరావు, చీఫ్ సూపరింటెండెనట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, రూటు అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !