UPDATES  

 బీ ఆర్ ఎస్ నూతన అధ్యక్షులు లక్ష్మణ్ రావు,ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి కి అపూర్వ స్వాగతం పలికిన మంగపేట గులాబీ శ్రేణులు.

బీ ఆర్ ఎస్ నూతన అధ్యక్షులు లక్ష్మణ్ రావు,ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి కి అపూర్వ స్వాగతం పలికిన మంగపేట గులాబీ శ్రేణులు.
మండల బీ. ఆర్.ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం
మన్యం న్యూస్ మంగపేట.
ములుగు జిల్లా మంగపేట మండలం విచ్చేసిన ములుగు జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ నూతన అధ్యక్షులు లక్ష్మణ్ రావు,ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి పర్యటన సందర్బంగా మంగపేట మండలం లోని గులాబీ శ్రేణులు మంగళవారం ఘన స్వాగతం పలికారు.రాజుపేట నుండి మంగపేట లోని అని గ్రామాలలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది, బైక్ ర్యాలీ తో గ్రామాలు గులాబీ దళం తో,గులాబీ జెండాలతో రెప రెపలాడాయి. అన్ని గ్రామాల నుండి గులాబీ దండు పెద్ద సంఖ్యలో కదిలి మండలం కేంద్రం లో బడే నాగ జ్యోతి కి అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం బి ఆర్ ఎస్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో బడే నాగజ్యోతి ములుగు బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతూ నాకు జన్మనిచ్చినది తల్లి తండ్రులు అయితే, పునర్జన్మ ను ఇచ్చినది కెసిఆర్, అటువంటి మహానుభావులు కెసిఆర్ కు ములుగు ప్రజల సహకారం తో ఎమ్మెల్యే గా గెలిచి ఈ విజయం కెసిఆర్ కు అంకితం ఇవ్వాలి అనుకుంటున్నాను అందుకు మీ ఆశీర్వాదాలు కావాలి కార్యకర్తలు, నాయకులు, అందరం కలసి కట్టుగా పని చేస్తే విజయం మన సొంతం అవుతుంది అప్పుడు భవిష్యత్ మనది, మన నియోజకవర్గం ను బంగారం లా అభివృద్ధి చేసుకుందాం, గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి పేదవారికి పంచుదాం, బంగారు భవిష్యత్ కు పునాదులు వేద్దాం అని తెలియజేశారు. ఏది ఏమైనాప్పటికీ ఇంతకాలం స్తబ్దతగా ఉన్న గులాబీ శ్రేణులలో ఒక్కసారిగా ఉత్సాహం రెట్టింపు అయింది.వారిలో నూతన జోష్ నెలకొంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !