మన్యం న్యూస్: జూలూరుపాడు, సెప్టెంబర్ 12, మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్య మహిళా కేంద్రాన్ని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలకు సంబంధించిన తొమ్మిది రకాల ఆరోగ్య సమస్యలకు ఈ కేంద్రం ద్వారా పరిష్కరించే దిశగా, కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కావున పరిసర ప్రాంత మహిళలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఇంటి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచడం ద్వారా, ఆ కుటుంబమంతా ఆయురారోగ్యాలతోటి ఆనందంగా ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా కరోనా ఇపత్కర పరిస్థితిలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలందించిన ఆరోగ్యశాఖ సిబ్బంది సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ సోనీ, జడ్పిటిసి కళావతి, వైస్ ఎంపీపీ నిర్మల, మండల పార్టీ అధ్యక్షుడు సతీష్ కుమార్, మండల రైతు కన్వీనర్ వీరభద్రం, చౌడం నరసింహారావు, వేల్పుల నరసింహారావు, మండల వైద్యాధికారి డాక్టర్ రాకేష్ కుమార్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.