మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబర్ 12::
దుమ్ముగూడెం తపాల శాఖ నందు నూతనంగా పార్సెల్ ప్యాకింగ్ సర్వీస్ ఏర్పాటు చేసినట్లు పోస్టల్ శాఖ భద్రాచలం సబ్ డివిజన్ పోస్టల్ ఏఎస్పి సుచందర్ తెలిపారు. మంగళవారం దుమ్ముగూడెం సబ్ పోస్ట్ ఆఫీస్ ను సందర్శించి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు తపాల శాఖ మెరుగైన సేవలు అందిస్తుందని దీనిలో భాగంగానే పార్సిల్ ప్యాకింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది ని దూర ప్రాంతాలకు సంబంధించిన వస్తువులను తక్కువ ధరకే పంపించే అవకాశం ఉందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సర్వీసులో వినియోగదారుడు పంపిన పార్సిలకు ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ పోస్ట్ మాస్టర్ ఎస్ వి రావు, పోస్ట్ మాన్ కిరణ్ , నందగోపాల్, దుర్గాప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.