మన్యం న్యూస్ కరకగూడెం: మండల పరిధిలోని మొగిళితోగు గ్రామానికి చెందిన చరప.రామయ్య ఇటీవల కాలంలో అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ దశదినకర్మలకు 25 కేజీల బియ్యం మంగళవారం అందజేశారు.ఈ కార్యక్రమంలో కిసాన్ అధ్యక్షులు నాగబండి.వెంకటేశ్వర్లు, మహిళల అధ్యక్షురాలు చందా.వెంకటరత్తమ్మ, కొరగట్ల.విశ్వనాధం,రవిందర్ తదితరులు పాల్గొన్నారు.
