మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబర్ 12::
ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 3 పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ అక్టోబర్ 9న బంద్ పిలుపునిస్తున్నట్టు ఆదివాసి సంక్షేమ పరిషత్ ఉపాధ్యక్షులు కామరాజు పేర్కొన్నారు. మంగళవారం దుమ్ముగూడెం లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ 1970 సంవత్సరాల తర్వాత ఏజెన్సీ ప్రాంతంలో వలస గిరిజనేత్రులు ఐదవ షెడ్యూల్ భూభాగంలోకి వచ్చి అభివృద్ధి ఫలాలు ఉద్యోగ అవకాశాలు కావాలని అడగడం ఏంటని ప్రశ్నించారు. ఆదివాసులకు దక్కవలసిన ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఉద్యోగాలు గిరిజనేత్రులు దోచుకోవడానికి ఆదివాసులు నిరాధారమైన జీవోను రద్దు చేయడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల కొరకు ఏర్పాటు చేసిన జీవో నెంబర్ ట్రైబల్ కోర్టులో అసెంబ్లీ తీర్మానం చేసి పటిష్టంగా అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి హేమ సుందర్, సతీష్, కుమార్, రవీందర్, నరసింహారావు, రవి, చందు, రేసు ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.