బడే నాగ జ్యోతి ని గెలిపిద్దాం
.. సీఎం కేసీఆర్ కు కానుకగా ఇద్దాం
*కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం.
*నాగజ్యోతి గెలుపే లక్ష్యంగా పని చేస్తాం.
*ప్రభుత్వ సంక్షేమ పథకాలు శ్రీరామ రక్ష.
పార్టీ శ్రేణులతో కలిసి లక్ష్యాన్ని చేదిస్తాం.
ములుగు జిల్లా బి ఆర్ ఎస్ నూతన అధ్యక్షులు లక్ష్మణ్ రావు.
మన్యం న్యూస్, మంగపేట: బీఆర్ఎస్ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగ జ్యోతిని గెలిపిద్దాం.. సీఎం కేసీఆర్ కి కానుకగా ఇద్దాం… ములుగు అభివృద్ధికి పాటుపడదాం అని ములుగు జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ రావు అన్నారు.
మండలం లో బి ఆర్ ఎస్ నూతన అధ్యక్షులు లక్ష్మణ్ రావు, ములుగు జిల్లా జడ్పి చైర్ పర్సన్,ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగ జ్యోతి లకుతొలిసారి మండలానికి రాగా బి ఆర్ ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ రావు మాట్లాడుతూ
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి బైక్ ర్యాలీతో వారికి స్వాగతం పలికారు.ర్యాలీ కమలాపూర్ , మంగపేట, బోర్ నర్సాపూర్, తిమ్మంపేట, మల్లూరు గ్రామాల మీదుగా మల్లూరు లక్ష్మీ నర్సింహా స్వామి దేవాలయం వరకు సాగింది. అక్కడ స్థానిక దేవాలయ అర్చకులు వారికి పూర్ణకుంభం, మేల తాళాలతో స్వాగతం పలకగా ఎమ్మెల్యే అభ్యర్థి నాగ జ్యోతి గెలవాలని కోరుతూ వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పార్టీ శ్రేణులను, రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడుతూ ,ముఖ్యమంత్రి కేసిఆర్ తనను ములుగు నియోజక వర్గ గడ్డపై రానున్న అసెంబ్లీ ఎన్నికలలో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ఈ బాధ్యతను అప్పగించారని, రానున్న రోజులలో ములుగు గడ్డపై గులాబీ జెండా ఎగురడం ఖాయమని ఆ లక్ష్యాన్ని తాను కేసిఆర్ అబిమానులు, పార్టీ శ్రేణులతో కలిసి అవలలీలగా చేదిస్తామని ఆశా బావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలకు ప్రజలలో మంచి ప్రజాదరణ ఉందని ఆ సంక్షేమ పథకాలే ప్రభుత్వానికి శ్రీరామ రక్ష అని నియోజక వర్గంలో ప్రతి కార్యకర్త ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి గెలుపే ద్యేయంగా పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను జిల్లాలోని అర్హులైన ప్రతి కార్యకర్తకు అందే విధంగా పని కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.