మన్యం న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 12: అశ్వారావుపేట నియోజకవర్గం కేంద్రంలో ఎమ్మార్పీఎస్, ఎమ్మస్పీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఈనెల 18 నుండి నిర్వహించే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని, మంగళవారం అశ్వారావుపేటలో రిలే నిరాహార దీక్ష శిబిరమును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోకన్వీనర్ కొలిక పోగు వెంకటేశ్వరరావు మాదిగ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి పార్టీ మేము అధికారంలోకొస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చి తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ ఎస్సీ వర్గీకరణ చేయకుండా మోసం చేసిందని అన్నారు.ఈ సమావేశంలో కోలేటి పకీరయ్య, కూలికపోగు కాంతారావు, కొలికపోగు ముసలయ్య, సొరకాయల సీతారాములు, గాలంకి అశోక్, నార్లపాటి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.