మన్యం న్యూస్, మంగపేట:
మండలంలోని ఆఖినేపల్లి గ్రామానికి చెందిన మాజి సర్పంచ్, బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ పేద విద్యార్థిని చదువు కోసం ఆర్ధిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు. నిట్ ఫలితాలలో గోగు మమత అనే నిరుపేద విద్యార్థిని మంచి ర్యాంక్ సాధించి కూడా ఉన్నత విద్య కు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న మండల నాయకులు శ్రీధర్ వర్మ తన వంతు సహాయం గా రూ5వేలు ఆర్థిక వితరణ అందజేసి మానవత్వం చాటుకున్నారు.
