మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలం ఆరవమైలు తండా వద్ద ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో రెండు బైకులు ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీమల వెంకటేశ్వర్లు సోమవారం మృతుల ఇళ్లకు వెళ్లి వారి పార్ధివదేహలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబసభ్యులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన అండగా ఉంటామని చీమల హామీనిచ్చారు. ఈ పరామర్షలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దళ్ సింగ్, ఇల్లందు మండల పార్టీ అధ్యక్షుడు పులిసైదులు, ప్రధాన కార్యదర్శి అరెం కిరణ్, నియోజకవర్గ సోషల్ మిడియా కోఆర్డినెటర్ నాగేంద్ర, భుక్యా ధర్మా, చీమల రామయ్య, చీమల లక్ష్మీనారయణ, కొడెం నాగరాజు, భుక్య శంకర్, చీమల రవి, కొడెం అబ్బయ్య, కొడెం వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.