పంచాయతీ కార్యదర్శిలకు అంగన్వాడి కేంద్రాల నిర్వహణ బాధ్యత
*అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె విరమించి తిరిగి వీధులలో చేరండి
ఎంపీపీ జల్లిపల్లి.శ్రీరామమూర్తి
మన్యం న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 12: మండల వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు సమ్మెలో ఉండడంతో అంగన్వాడీ కేంద్రానికి రెగ్యులర్ వచ్చే బాలింతలు గర్భిణీలు చిన్నారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా అంగన్వాడి కేంద్రాలలోని సరుకులనుజిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీపీ జలిపల్లి ,ఎంపీడీవో శ్రీనివాస రావు, ఎల్డిసి శ్రీనివాస రావు, అంగన్వాడీ సీడిపిఓ రోజారాణి, ఐసిడిఎస్ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహి గ్రామ పంచాయతీల సెక్రటరీలకు అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె విరమించి తిరిగి వీధులలో చేరాలని అన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకు వేతనాలను పెంచి సరైన గౌరవం ఇవ్వడం జరిగిందని, త్వరలోనే వారి న్యాయపరమైన డిమాండ్లు నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ విజయలక్ష్మి, సెక్రటరీ తేజ తదితరులు పాల్గొన్నారు.
