మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబర్ 13::
తెలంగాణ ప్రభుత్వం పథకల పేరుతో ప్రజాధనం నిర్వీర్యం చేస్తుందని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవికుమార్ ఆరోపించారు. బుధవారం మండలంలోని గౌరారం గ్రామంలో పర్యటించిన బిఎస్పి నాయకులు అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రజలకు చేరకుండా నాసిరకంగా నిర్మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పథకాల పేరుతో బినామీ కాంట్రాక్టర్లు లాభపడుతున్నారని ప్రజల అభివృద్ధిని గురించి ప్రభుత్వం మరిచారని మండిపడ్డారు. దీన్ని ఆసరాగా తీసుకున్న మందుబాబులకు ఆవాంఛనీయ సంఘటనకు వాడుకుంటున్నారని, వెంటనే లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గాడిద దామోదర్ రావు, మండల అధ్యక్షులు సింహాద్రి, సూరి, వీరస్వామి, రాజు, సుభద్ర, తదితరులు పాల్గొన్నారు.