అంగన్వాడి డిమాండ్ లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి
అంగన్వాడి టీచర్స్ చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన ఆదివాసి సేన
అశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఊకే రవి
మన్యం న్యూస్, అశ్వరావుపేట, సెప్టెంబర్, 13: మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్స్ చేస్తున్న నిరవధిక సమ్మెకు ఆదివాసి సేన రాష్ట్ర సహాయ కార్యదర్శి అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉకే రవి మద్దతు తెలిపారు. బుధవారం దీక్ష శిబిరం వద్దకు వెళ్లి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం యొక్క మొండి వైఖరి నశించాలని, అంగన్వాడి టీచర్స్ చేస్తున్న న్యాయబద్ధమైన డిమాండ్లను రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి పరిష్కరించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నిత్యవసర వస్తువులు ధరలు పెరిగిన క్రమంలో ఎక్కువ భారం పడి తక్కువ వేతనం వస్తుందున దానికి సరైనా సౌకర్యాలు నిత్యవసర వస్తువులు అందలేక కుటుంబ పోషణ ఇబ్బందిగా మారుతుందని దీనిని వెంటనే ప్రభుత్వం పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలని లేని పక్షంలో ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు అంగన్వాడీ టీచర్లు పోరాటాలు నిర్వహించాలని వారికి ఆదివాసి సేన కమిటీ ఎల్లప్పుడూ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వగ్గెల రామకృష్ణ, మండల అధ్యక్షులు సొందెం సుమన్, కార్యదర్శి పునెం రమేష్ నాయకులు పాల్గొన్నారు.