మన్యం న్యూస్, వాజేడు:
వాజేడు మండలం పెద్దగొల్లగూడెం గ్రామంలో పల్లె దవాఖానా నూతన భవనాన్ని గ్రామాల సర్పంచులు బుధవారం ప్రారంభించారు. ప్రభుత్వం పేదల ముంగిటకే అందుబాటులోకి, ప్రభుత్వ వైద్యం తీసుకురావాలనే మంచి లక్ష్యంతో, పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసిందని, దవాఖానాల ద్వారా ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అవుతాయని సర్పంచ్ లు ఈ సందర్భంగా ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ తెలిపారు. సర్పంచులు జజ్జరి మేనక,(పెద్దగొల్లగూడెం) కోరం సమ్మక్క (చీకుపల్లి), కోరం సాంబయ్య (దూలాపురం), చెరుకూరు ఎంపిటిసి. బీరబోయిన పార్వతి, ఈ కార్యక్రమంలో పాల్గన్నారు. వాజేడు వైద్య అధికారులు డాక్టర్ కొమరం మహేందర్, డాక్టర్ మధుకర్,హెచ్ వి, వెంకటరమణ, స్టాఫ్ నర్సు శ్రావంతి,సి ఎచ్ ఓ, సూర్యప్రకాశరావు, సూపర్వజర్ కొప్పుల కోటిరెడ్డీ,ఎ ఎన్ ఎం, నాగేంద్ర,లలిత, స్థల దాతలు పాయం శ్రీనివాసరావు ఆశా కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.