పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్*
ఫ్రెండ్లీ పోలీస్ లక్ష్యం: డిఎస్పి రమణమూర్తి
మన్యం న్యూస్ గుండాల: గుండాల, ఆళ్లపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అల్లపల్లి మండలం అడవిరామారం గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ బుధవారం నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంపు ను ఇల్లందు డిఎస్పి రమణమూర్తి ప్రారంభించారు .అనంతరం ఆయన మాట్లాడుతూ. ఫ్రెండ్లీ పోలీస్ లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన అన్నారు అందులో భాగంగానే గిరిజన గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రాబలకుండా హెల్త్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, జ్వరాలు రావడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు కొందరు నిర్లక్ష్యం చేయడం వలన ప్రాణాలు సైతం పోతున్నాయని ఆయన అన్నారు. హాస్పటల్ వెళ్లలేని పరిస్థితిలో ఉన్న వాళ్లందరి కోసం ఈ హెల్త్ క్యాంప్ ను నిర్వహించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన అన్నారు. గుండాల ప్రాథమిక వైద్యశాల వైద్యులు మనీష్ రెడ్డి, ఆళ్ల పళ్లి వైద్యశాల వైద్యులు రేవంత్ లు ఈ మెగా హెల్త్ క్యాంపులో సేవలు అందించారని వారికి పోలీస్ శాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ఇక్కడే అన్ని రకాల పరీక్షలు నిర్వహించి సుమారు 100 మంది గ్రామస్తులకు మందులను అందించినట్టు డిఎస్పి రమణమూర్తి పేర్కొన్నారు. ప్రజా చేసే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుండాల సీఐ రవీందర్, గుండాల ఎస్సై కిన్నెర రాజశేఖర్, తాళ్లపల్లి ఎస్సై రతీష్, సర్పంచ్ శ్రీదేవి, వైద్య సిబ్బంది సత్యం, రాఘవులు, బిక్షమయ్య, శ్రీధర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
