మన్యం న్యూస్ మణుగూరు:
పినపాక నియోజకవర్గంను అభివృద్ధి చేసిన ఘనత ప్రభుత్వ విప్,రేగా కాంతారావు కే దక్కుతుందని మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు తెలిపారు.ఈ మేరకు మణుగూరు మండలం లోని జెడ్పీటీసీ కార్యాలయం లో ఎంపీటీసీల తో ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పిటిసి పోశం నరసింహారావు మాట్లాడుతూ, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లాది రూపాయలు మంజూరు చేయించి,నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. మణుగూరు అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తూ,సమస్యలన్నీటిని పరిష్కరిస్తున్నారు అని అన్నారు.గతంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధిని చేసి చూపించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు నియోజకవర్గ అభివృద్ధిలో 100 శాతం విజయం సాధించారన్నారు. రాష్ట్రంలో మూడోసారి బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం లోకి వస్తుందని సీఎం కేసీఆర్ మూడవసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని వారు స్పష్టం చేశారు.అభివృద్ధి, సంక్షేమ ప్రభుత్వానికి అందరూ అండగా నిలవాలని వారు కోరారు.ఈ సమావేశంలో ఎంపీపీ కారం.విజయ కుమారి, ఎంపీటీసీ లు గుడిపూడి. కోటేశ్వరరావు,తాటి.సరిత,మచ్చ.సమ్మక్క,గాజుల.రమ్య,కో ఆప్షన్ సభ్యులు జావీద్ పాషా తదితరులు పాల్గొన్నారు.