మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మున్సిపాలిటీ పరిధి లోని శివలింగాపురం రెండవ బూత్ లో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి సమావేశం బిఅర్ఎస్ మండల అధ్యక్షులు ముత్యం బాబు ముఖ్య అతిథి గా పాల్గొన్నారు.నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో ముత్యం బాబు మాట్లాడుతూ, రానున్న రోజుల్లో కేసీఆర్ అందిస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను,స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతరావు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను గడపగడపకు తీసుకెళ్లి రానున్న ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలియజేశారు. సమావేశ అనంతరం గడపగడపకు ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో శివలింగాపురం బూత్ ఇంచార్జ్ సీనియర్ నాయకులు తాతా రమణ, నియోజకవర్గ యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ బోశెట్టి రవి ప్రసాద్,ఓబీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు తురక రామకోటి,మణుగూరు పట్టణ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం సృజన్, యూత్ నాయకులు బాజీ, చింటూ,మహిళా నాయకులు మనమ్మ,అనూష పుష్పలత, స్థానిక మహిళలు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.