మన్యం న్యూస్,మణుగూరు:మణుగూరులో శ్రీ ముత్యాలమ్మ ఆలయాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా నాయకురాలు, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే
సీతక్క కు మణుగూరు మండల కాంగ్రెస్ శ్రేణులు సిఎస్పి వద్ద. బైక్ ర్యాలీతో, సీతక్క నినాదాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరంముత్యాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు సీతక్క కు శాలువా కప్పి, పూల మాలలు అందచేసి సన్మానించి బోనం ఎత్తించారు.బోనం ఎత్తుకున్న సీతక్క డప్పు వాయిధ్యాలతో, యువకుల నృత్యాలతో బోనాన్ని ముత్యాలమ్మకి సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు.రాష్ట్ర ప్రజలందరు సుఖ సంతోషాలతో సుబిక్షంగా, ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్బంగా అమ్మవారిని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు దాన సరి సూర్య,రాము, చందా వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.