గుడుంబా విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు
* గుడుంబా కాస్తే కఠిన చర్యలు
*కరకగూడెం ఎస్ఐ రాజారామ్
మన్యం న్యూస్, కరకగూడెం:మండల పరిధిలోని కల్వలనాగరం,దేవరనాగరం గ్రామాలలో గుడుంబా(సార) విక్రయాలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారం మేరకు కరకగూడెం ఎస్ఐ రాజారాం తన సిబ్బందితో తనిఖీ నిర్వహించారు.ఈ క్రమంలో
కల్వలనాగరం గ్రామానికి చెందిన కలం.నరసింహరావు, దేవారనాగరం గ్రామనికి చెందిన సోలం.వెంకటనర్సమ్మ, తోలెం.లక్ష్మీ అనే వ్యక్తులు గుడుంబా విక్రయాలు జరుగుతూ పట్టుబడి నట్లు కరకగూడెం ఎస్ఐ రాజారామ్ తెలిపారు.పట్టుబడిన వ్యక్తులపై సంవత్సర కాలం పాటు సత్ ప్రవర్తన హామి కోరకు తహశీల్దారు కార్యాలయం నందు బైండోవర్ చెయ్యడం జరిగిందని అయన తెలిపారు.అలాగే మండలంలోని ఎ గ్రామంలో అయిన నిషేధిత గుడుంబా అమ్మకాలు జరిపితే సమాచారం అందించాలని అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గుడుంబా విక్రయాలకు పాల్పడితే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని ఎస్ఐ హెచ్చరించారు.
