మన్యం న్యూస్ బూర్గంపహాడ్: మండల పరిధిలోని సారపాక గ్రామపంచాయతీ పరిధి గాంధీనగర్ లో నివాసం ఉంటున్న బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు చుక్కపల్లి బాలాజీ తాత అయిన చుక్కపల్లి గోపాలరావు బుధవారం మృతి చెందాడు.జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత పిఏసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, వారి వాసానికి వెళ్లి గోపాలరావు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో సారపాక టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీను,సారపాక టౌన్ యూత్ ప్రెసిడెంట్లు సోము లక్ష్మి చైతన్య రెడ్డి,భూక్యా కృష్ణ,సారపాక టౌన్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలి శ్రీహరి,ప్రధాన కార్యదర్శి భూక్యా చిరంజీవి,బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు చుక్కపల్లి బాలాజీ,బిట్ర సాయిబాబు,రెడ్డిపోగు రవి,రాయల నరేందర్ పలువురు కార్యకర్తలు,గ్రామ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.