మన్యం న్యూస్,ఇల్లందు: పట్టణంలో గల జెడ్పీచైర్మన్ క్యాంపు కార్యాలయం నందు ముఖ్య నాయకులతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య బుధవారం సాయంత్రం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కోరం మాట్లాడుతూ..ఈనెల 17వ తేదీన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో నిర్వహించనున్న సోనియాగాంధీ భహిరంగ సభకు ఇల్లందు నియోజకవర్గం నుంచి పెద్దయెత్తున తరలివెళ్ళేలా కార్యకర్తలను సన్నద్ధం చేయాలని మండల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనకయ్య దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామపంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల ముఖ్యనాయకులు పాల్గొన్నారు.