*వ్యాపారుల కొత్త ఎత్తుగడ..ఒరిస్సా రాష్ట్రంలో బియ్యం దందా !
బూర్గంపహాడ్ లో 300 క్వింటాల బియ్యం లారీ పట్టివేత.
పాల్వంచ రైస్ మిల్లు నుండి తరలిస్తున్న క్రమంలో పట్టివేత.
ముగ్గురిపై క్రిమినల్ కేసు నమోదు.
ఈదందాపై అధికార యంత్రాంగం దృష్టి సారించాలి.
మన్యం న్యూస్ బూర్గంపహాడ్:-బూర్గంపహాడ్ మండలంలోని కొన్ని రేషన్ దుకాణాల డీలర్లతో పాటు భద్రాద్రి జిల్లాలోని పలు రేషన్ డీలర్లు సైతం లబ్దిదారుల నుంచి రేషన్ దుకాణాల వద్దనే డబ్బులు ఇచ్చి పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.రేషన్ ద్వారా లబ్దిదారులకు చేరుతున్న బియ్యాన్ని చిరువర్తకులు,వ్యాపారులు కొనుగోలు చేసి చిన్న మొత్తాలుగా ఉన్న సరుకును వారి నుంచి సబ్ డివిజన్లో రేషన్ బియ్యాన్ని గతంలో కంటే మరింత ఉధృతంగా ఆంధ్రాతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన బడా వ్యాపారులు కొనుగోలు చేసుకుని వెళ్తున్నట్టు రోపణలు వినిపిస్తున్నాయి.యద్ధేచ్ఛగా పీడీఎస్ బియ్యం కొనుగోళ్ళు బూర్గంపహాడ్ మండలంలోని పలు గ్రామాల్లో ఈ వ్యాపారం డీలర్ల కనుసన్నల్లో గుట్టుగా సాగుతున్నట్టు వినికిడి,పీడీఎస్ బియ్యం దందా సాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నప్పటికి సంబంధిత అధికారులు ఇట్టి విషయం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.రేషన్ దుకాణాల వద్దనే పీడీఎస్ బియ్యాన్ని లబ్దిదారులకు ఇచ్చినట్టే ఇచ్చి మరల వెంటనే వారికి ఆ బియ్యాన్ని సరిపడా నగదును అందిస్తూ,ఆ బీడీఎస్ బియ్యాన్ని బడా బాబులకు అమ్ముతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మరి కొందరి బియ్యం వెలిముద్ర ద్వారా ప్రతినెల వారికి అమ్మే విధంగా ఒప్పందాలు సైతం కుదుర్చుకున్నట్లు వినికిడి.ఇట్టి బియ్యం అర్ధరాత్రి వేళల్లో గుట్టు,చప్పుడు కాకుండా బియ్యాన్ని తరలిస్తుంటారు.లబ్దిదారుల నుంచి ప్రత్యేకించి కాలనీలు,పేద వర్గాల వారు,పట్టణాల్లో ఉన్న మధ్యతరగతి వారి నుంచి ఈ బియ్యాన్ని సేకరిస్తున్న చిరు వ్యాపారులు,వీటిని తమకు అనువుగా,అందుబాటులో ఉన్న నాన్ ట్రేడింగ్ మిల్లులకు,పరపతి ఉన్న ట్రేడింగ్ మిల్లుకు బహిరంగంగానే తరలిస్తున్నారు.ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇస్తున్న బియ్యం దళారులు,వ్యాపారులు లక్షల రూపాయలు సంపాదించుకునేందుకు ఉపయోగపడుతున్నాయనీ చెప్పుకోవచ్చు.ప్రభుత్వం నిరుపేదలకు కడుపునిండా తిండిని అందించాలనే ఉన్నత లక్ష్యంతో అమలు చేస్తున్న రేషన్ బియ్యం పంపిణీ ఆ ఆశయానికి తూట్లు పొడిచే విధంగా కొనసాగుతున్న ఈదందాపై అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఈ క్రమంలో మంగళవారం రాత్రి విస్వనియత సమాచారం మేరకు సివిల్ సప్లే డిప్యూటీ తాహాసిల్దార్ బూర్గంపహాడ్ పోలీస్ సిబ్బందితో కలిసి మండల పరిధిలోని సారపాకలో చాకచక్యంగా సుమారు 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకొని బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ కి తరలించి ఇట్టి బియ్యం రేషన్ బియ్యం అని నిర్ధారించుకున్న తర్వాత కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించారు,పట్టుబడ్డ డ్రైవర్ తో పాటు మరో ఇద్దరిని విచారించగా ఇట్టి రేషన్ బియ్యం పాల్వంచలోని నరిగే రవీంద్రనాథ కి చెందిన శ్రీరామాంజనేయ రైస్ మిల్లు నుండి ఒరిస్సా రాష్ట్రం అయినా మల్కనగిరి జిల్లాకు తరలిస్తున్నట్టు వారు తెలిపారు.ఈ దాడుల్లో సివిల్ సప్లై డిటి కె,వెంకటేశ్వర్లు బూర్గంపహాడ్ ఎస్ఐ రాజ్ కుమార్,అదనపు ఎస్ఐ నాగాబిక్షం,ఏఎస్ఐ అప్పారావు పోలీస్ ఇబ్బంది దుర్గారావు,మల్లికార్జున్ పాల్గొన్నారు.