UPDATES  

 మీకు నేనున్నా.. గెలిచి రండి

మీకు నేనున్నా.. గెలిచి రండి
* గులాబీ బిగ్ బాస్ నుండి ఆశీర్వాదం
* జనంలో ఉండండి అభిమానాన్ని పొందండి
* ముచ్చటగా మూడోసారి విజయం మనదే
* అభ్యర్థులకు ధైర్యం చెప్పి పంపిస్తున్న కెసిఆర్

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
తెలంగాణ ప్రజలకు విజయవంతంగా సంక్షేమ పాలన అందిస్తున్నాం.. మూడోసారి కూడా అధికారం మళ్లీ మనదే.. మీకు నేనున్నా మీరంతా రెట్టింపు ఉత్సాహంతో పని చేయండి.. ప్రజల అభిమానాన్ని చురగొనండి.. రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి తెలంగాణ భవన్ కు తిరిగి రావాలంటూ.. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు గులాబి బిగ్ బాస్ ఉత్సాహంతో ధైర్యం చెప్పి పంపిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం గులాబీ బిగ్ బాస్ కెసిఆర్ సీఎం పదవి చేపట్టిన తర్వాత ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందిస్తూ ప్రగతిని అందరికీ కనిపించేలా ఆ ప్రగతిని చిరస్థాయిగా నిలిచిపోయేలా చేస్తూ దేశం తెలంగాణ వైపు చూసేలా చేయడం గమనించాల్సిన విషయం. ముచ్చట మూడోసారి కూడా విజయం సాధించేలా గులాబీ బిగ్ బాస్ అడుగులు వేయడం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రానున్న ఎన్నికల్లో పోటీ చేసే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పేర్లను దాదాపుగా సీఎం కేసీఆర్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి పోటీ చేసేవారి పేర్లను ఖరారు చేయడంతో వారంతా సీఎం కేసీఆర్ వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకొని పోతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుతో పాటుగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, భద్రాచలం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపీ నామ నాగేశ్వరరావులు సీఎం కేసీఆర్ ను కలవడం జరిగింది. ఈ సందర్భంగా టికెట్లు కేటాయించబడిన వారంతా సీఎం కేసీఆర్ కు పుష్పగుచ్చమిచ్చి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. దీంతో కేసీఆర్ మీకు నేనున్నాను భారీ మెజారిటీతో గెలిచి ప్రగతి భవన్ కు తిరిగి రావాలని అభ్యర్థులకు అభయమిస్తూ వారిలో చిరునవ్వు ఉత్సాహాన్ని నింపి పంపిస్తున్నారు.
మంత్రి కేటీఆర్ ను కలిసిన రేగా…
తెలంగాణ ప్రగతిభవన్లో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను గురువారం ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు కలిసి పార్టీ అధినేత టికెట్ కేటాయించిన సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అభ్యర్థులు ఇటు సీఎంను అటు మంత్రి కేటీఆర్ స్వయంగా కలిసి వారి ఆశీర్వాదం తీసుకొని వస్తుండడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారడంతో పాటు గులాబీ శ్రేణుల్లో జోష్ కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ మూడోసారి కూడా గులాబీ పార్టీకే గెలుపు వాతావరణం కనబడుతుందని స్వయంగా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకోవడం గమనించాల్సిన విషయం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !