మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
చుంచుపల్లి మండలం బాబు క్యాంపులో ఉన్న సఖి కేంద్రంను గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి సందర్శించారు. గృహింస, వేధింపులు, దాడులకు గురైన మహిళలకు పునరావాసం కల్పించి తక్షణ వైద్య, న్యాయ సహాయం అందించి బాధితులకు న్యాయం జరిగేల చర్యలు తీసుకోవాలని తెలిపారు. బాధితులకు అందిస్తున్న కనీస సౌకర్యాల గురించి న్యాయమూర్తి ఆరా తీశారు. సఖి సెంటర్ ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి బాధిత మహిళలకు భరోసా ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ జ్యోతి విశ్వకర్మ, నాగ స్రవంతి, న్యాయవాది మెండు రాజమల్లు, సఖి సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.