మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: కొత్తగూడెంలో బైపాస్ రోడ్డు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు. రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మధురబస్తీకి నివాసి మృతదేహానికి గురువారం నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెంలో జనాభా రోజురోజుకు పెరుగుతున్న బైపాస్ రోడ్డు మంజూరు చేయకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం సరిగ్గా లేకపోవడంతో బ్రిడ్జి వద్ద నీరు ఇసుక ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి నిరుపేద కుటుంబాలకు అయిదు లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు, జిల్లా సహాయ కార్యదర్శి చెనిగారపు నిరంజన్ కుమార్, అసెంబ్లీ చేరికల కమిటీ ఛైర్మన్ గుడివాడ రాజేందర్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి అల్లకొండ శరత్ తదితరులు పాల్గొన్నారు.