మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం పట్ల నిరసిస్తూ గురువారం లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలో మొర్రేడు బ్రిడ్జి వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులు కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం రాష్ట్ర నాయకులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ నిరుద్యోగ ఉపవాస దీక్ష చేపట్టడం జరిగిందన్నారు. 24 గంటలు దీక్షకు పర్మిషన్ ఉన్న కెసిఆర్ ప్రభుత్వం పోలీసు వాళ్ళతో అక్రమ అరెస్టు చేయించడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయని భావించిన యువత తెలంగాణ వచ్చాక నిరుద్యోగుల మరణాలు పెరిగాయని రాష్ట్రంలో కెసిఆర్ కెసిఆర్ అరాచక పాలనకు త్వరలోనే బుద్ధి చెప్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రం రాజు, పోలిశెట్టి వెంకటేశ్వర్లు, నియోజకవర్గ కన్వీనర్ నరేంద్రబాబు, లక్ష్మీదేపల్లి మండల ప్రధాన కార్యదర్శి మాలోత్ గాంధీ, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు గంధం ప్రసాద్ గౌడ్, గిరిజన మోర్చ జిల్లా కార్యదర్శి మాలోత్ ప్రశాంత్, రమాదేవి, కవిత, సతీష్, సంపత్, సాంబ, సీతారాములు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.