UPDATES  

 ఒంటరి మహిళలకు ఆర్థిక చేయుత.

 

మన్యం న్యూస్ బూర్గంపహాడ్:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాహాడు మండలం సారపాక గ్రామం పరిధిలో ఐటీసీ బంగారు భవిష్యత్ బంధన్‌ సంస్థ ఆధ్వర్యంలో ఒంటరి మహిళలకు వాళ్ల స్వతహాగా చిరు వ్యాపారం చేసుకునే విధంగా 25 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 8400 చొప్పున రెడీమేడ్ ఐటమ్స్,బట్టల దుకాణం,కిరాణా ఐటమ్స్,లాండ్రి,ఫ్యాన్స్ ఐటమ్స్,వెజిటేబుల్స్,పండ్లు,చికెన్ షాప్,ఫుట్వేర్,డ్రై ఫిష్,కుట్టు మిషన్లు సహాయం చేయడం జరిగింది.ఒంటరి మహిళలు స్వతహాగా వారి కాలం మీద వారు నిలబడే విధంగా సమాజంలో ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందడానికి ఐటీసీ బంగారు భవిష్యత్ బంధన్‌ సంస్థ ద్వారా ప్రోత్సహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా బంధన్‌ ప్రోగ్రాం ఆఫీసర్ దీపక్ మాట్లాడుతూ ఒంటరి మహిళల అభివృద్ధికి మా సంస్థ సహకారాలు అందిస్తుందని వారు తెలియజేశారు.25 మంది లబ్ధిదారులకు 2,10,000 రూపాయలు లబ్ధి పొందారు.ఒంటరి మహిళలు ఆర్థికంగా సామాజికంగా వారు ఎదగాలని మేము కోరుకుంటున్నాం.ఈ కార్యక్రమంలో ఐటిసి ఎమ్మెస్ కే పి ఓ సుచిత్ర,బంధన్‌ ప్రోగ్రాం ఆఫీసర్ దీపక్,బంధన్‌ ఏరియా కోఆర్డినేటర్ ఉత్తం మరిజిత్,బంధన్‌టిఎల్ నాగరాజు,ఇరవెండి సర్పంచ్ కొరస లక్ష్మి,కోయగూడెం సర్పంచ్ తుపాకుల రామలక్ష్మి,సిబ్బంది శరత్,నాగేంద్రబాబు,అంబేద్కర్,ప్రవీణ్ కుమార్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !