మన్యంన్యూస్,ఇల్లందు:పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు విద్యార్థులకు ఓటునమోదు, ఓటింగ్ యంత్రాలపై అవగాహన కార్యక్రమాన్ని రాజనీతి శాస్త్రవిభాగం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పొలారాపు పద్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఇల్లందు తహసిల్దార్ రవికుమార్ మాట్లాడుతూ..ఓటింగ్ యంత్రాల పనితీరు, అవి పనిచేసే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈనెల 17వ తారీకు వరకు ఓటునమోదు చేసుకోవాలని అక్టోబర్ ఒకటోతారీకు వరకు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజు, అకడమిక్ కోఆర్డినేటర్ శేఖర్, చెంచరత్నయ్య, ఇంద్రాణి, సరిత పాల్గొన్నారు.
