మన్యంన్యూస్,ఇల్లందు ఇల్లందు సింగరేణి ఏరియా వర్క్ షాపులో ఎలక్ట్రీషన్ హెల్పర్లు, మ్యాన్ పవర్ సరిగాలేక ఎలక్ట్రీకల్ పనులు పూర్తికాక కార్మిక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని బీఎంఎస్ ఇల్లందు ఏరియా ఉపాధ్యక్షులు నాయని సైదులు తెలిపారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం కారణంగా క్వాటర్స్ కూడా పాతవికావటంతో క్వార్టర్స్ గోడలకు నిమ్మువచ్చి షాట్ కొట్టె ప్రమాదం ఉందన్నారు. అదేవిధంగా జేకే ఒసీలో కూడా జనరల్ మజ్దూర్ కొరతవుందని కావున యాజమాన్యం తక్షణమే స్పందించి ఎలక్ట్రియన్ హెల్పర్స్, మజ్దూర్ ను ఏర్పాటుచేయాలని నాయని సైదులు డిమాండ్ చేశారు.
