పంచాయతీ కార్యదర్శులకు పర్మినెంట్ పత్రాలు అందజేసిన ఎంపీపీ జల్లిపల్లి
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంపీపీ జల్లిపల్లి
మన్యం న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 14: అశ్వారావుపేట మండల కేంద్రంలో ప్రజా పరిషత్ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అశ్వారావుపేట మండలంలో 14 మంది పంచాయతీ కార్యదర్శులకు రెగ్యులర్ చేస్తూ పె స్కేల్ వర్తింప జేస్తు వచ్చిన ఆర్డర్స్ కాపీలను గురువారం కార్యదర్శులకు అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పంచాయితీ కార్యదర్శులకు ఇచ్చిన మాట ప్రకారం 4 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పంచాయతీ కార్యదర్శికి రెగ్యులర్ చేస్తానని పే స్కేల్ ను వర్తింపజేస్తానని మాట ఇచ్చారు, ఇప్పుడు చేసి చూపించారని, తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ మాట ఇస్తే తప్పరని మరోసారి రుజువు అయిందని కెసీఆర్ చెప్పారంటే చేసి చూపిస్తారని, ఆయన తెలియజేశారు. అలాగే కార్యదర్శులకు రెగ్యులర్ చేస్తూ ఇచ్చిన ఆర్డర్స్ పత్రలను అశ్వారావుపేట నియోజక వర్గ శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వర రావు ఆదేశానుసారం గురువారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు అర్హులైన కార్యదర్శులు 14 మందికి పత్రాలను అందజేయటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ శ్రీనివాస రావు, ఈవో హరికృష్ణ, కార్యదర్శి శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.