మన్యం న్యూస్ గుండాల: ప్రజాపంథా అనుబంధ సంఘం పి వై ఎల్ ఆధ్వర్యంలో నడిమి గూడెం గ్రామంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం అధ్యక్ష కార్యదర్శులు సనప కుమార్, పూనెం మంగయ్యలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. 40 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసి ఎన్నికలకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకరన్న, కృష్ణ, బాబురావు, జోగయ్య తదితరులు పాల్గొన్నారు
