మంత్రి హరీష్ రావుని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్
మమత వైద్యశాల సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే హరిప్రియ నాయక్
మన్యం న్యూస్,ఇల్లందు:ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఖమ్మం నగరానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుని ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం మమత వైద్యకళాశాల సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియ పాల్గొనగా మంత్రి అజయ్ కుమార్ తనయుడు ఎమ్మెల్యే హరిప్రియ నాయకులు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్ దిండిగల రాజేందర్, కామేపల్లి కోటమైసమ్మ ఆలయ కమిటీ అప్పారావు, సోషల్ మీడియా ఇంచార్జి గిన్నారపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.