మన్యం దుమ్ముగూడెం సెప్టెంబర్ 14::
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వెంటనే ప్రకటించాలని టిపిటిఎఫ్ భద్రాది జిల్లా అధ్యక్షులు బి రాజు డిమాండ్ చేశారు. గురువారం ఐటిడిఏ కార్యాలయంలో టి పి టి ఎఫ్ జిల్లా నాయకులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని, బదిలీలు, పదోన్నతులు వెంటనే ప్రకటించాలని కోరారు. డిప్యూటేషన్ పై ఉన్న ఉపాధ్యాయులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం భద్రాచలం పిఓ ప్రితిక్ జైన్ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి హరిలాల్, రామాచారి, దుమ్ముగూడెం మండల ప్రధాన కార్యదర్శి రవి, మండల అధ్యక్షులు జోగారావు, తదితరులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.