మన్యం న్యూస్ ,పినపాక: మండలంలోని జానంపేట పంచాయతీ లోని జిల్లా పరిషత్ పాఠశాల లో శుక్రవారం ఘనంగా మండల స్థాయి క్రీడలు ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలకు పినపాక ఎంపిపి గుమ్మడి గాంధీ ముఖ్య అతిధిగా పాల్గోని క్రీడా జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపిపి గుమ్మడి గాంధీ మాట్లాడుతూ… విద్యార్థులుకి చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని,క్రీడలు వల్ల శరీరం దారుడ్యంగా ఉంటుందని అన్నారు.చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. ఎల్చిరెడ్డి పల్లి విద్యార్థులు సంస్కృత కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణ,అత్మ కమిటి చైర్మన్ పోనుగోటి భధ్రయ్య,సొసైటీ చైర్మన్ రవి శేఖర్ వర్మ,పాఠశాల కమిటి చైర్మన్ మహాలక్ష్మి, వ్యాయమ ఉపాధ్యాయులు పోలెబోయిన అనిల్ కూమర్, విజయ లక్ష్మి,భాయమ్మ,ఆదినారాయణ,వీరన్న,జనార్థన్,దశమి బాబు,ఉపాధ్యాయులు నరేష్ తదితరులు పాల్గొన్నారు.
