మన్యం న్యూస్ బూర్గంపహాడ్:చట్ట సభల్లో మహిళలకు 33 శాతం అదేవిధంగా బిసి లకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని,పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ మద్దతుగా మణుగూరు పట్టణంలోశనివారం వ్ నిర్వహించనున్న బీ ఆర్ ఎస్ భారీ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత పిలుపునిచ్చారు. ఆమె శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.బీ ఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులు,సర్పంచులు,ఉప సర్పంచులు,గ్రామ కమిటీ అధ్యక్షులు,వార్డు మెంబర్లు,అనుబంధ సంఘ నాయకులు,మాజీ ప్రజా ప్రతినిధులు,యువజన నాయకులు,మహిళా నాయకులు,బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
