కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం…
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు…
మన్యం న్యూస్ చండ్రుగొండ, సెప్టెంబర్ 15: కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని రాష్ట్ర టీపీసీసీ ప్రధానకార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు శుక్రవారం విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చిన, అధిష్టానం నిర్ణయమే శిరోదార్యమని, అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, కొత్తగా వచ్చిన నాయకులను సమిష్టి కృషితో, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, తాటి అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కోణకండ్ల వెంకటరెడ్డి, నల్లమోతు రమణ, సర్పంచ్ పదం వినోద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వనమా గాంధీ, దారం గోవిందరెడ్డి, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు అంతటి రామకృష్ణ, బానోతు భీముడు, బొర్రా సురేష్ , ఓర్సు రామకృష్ణ, చాపలమడుగు మనోహర్,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.