మన్యం న్యూస్, మంగపేట: మండల పరిధిచుంచుపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ మాల మహానాడు జిల్లా అధికార ప్రతినిధి బోడ శ్రీను తల్లి గత కొద్దీ రోజుల క్రింద జ్వరం తో బాధపడుతు మృతి చెందింది. ఈ విషయం తెలుసుకొని తెలంగాణ మాల మహానాడు ములుగు జిల్లా అధ్యక్షులు, ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కమిటీ జిల్లా కమిటీ సభ్యులు రాజమల్ల సుకుమార్ శుక్రవారంవారి నివాసం వద్దకు వెళ్లి నారాయణమ్మ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళ్లు తెలిపి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యదర్శి నిమ్మగడ్డ ప్రవీణ్,మండల ప్రధాన కార్యదర్శి కర్రీ నాగేంద్రబాబు, మండల అధికార ప్రతినిధి మురుకుట్ల నరేందర్, మాజీ మండల అధ్యక్షులు తాలూకా సంపత్,మండల నాయకులు దొడ్డ భాస్కర్, విరస్వామి,తదితరులు పాల్గొన్నారు.
