మన్యం న్యూస్ గుండాల: మండలంలో ఏర్పాటు చేస్తున్న వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని గుండాల సీఐ ఎల్ రవీందర్ సూచించారు. ముందుగా స్థానిక గ్రామపంచాయతీ అనుమతితో విద్యుత్ శాఖ వారి అనుమతి తీసుకొని వచ్చి పోలీస్ శాఖ వారి దగ్గర మైక్ పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. వినాయక ఉత్సవ కమిటీల వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్లలో అందజేయాలన్నారు. ప్రశాంత వాతావరణంలో వినాయక ఉత్సవాలను నిర్వహించుకోవాలని సూచించారు. రహదారులకు అడ్డంగా మండపాలన ఏర్పాటు చేయకుండా చూసుకోవాలన్నారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మైక్ ఉపయోగించాలని సూచించారు. మండపాల వద్ద కాపలాగా కమిటీ సభ్యులు ఉండాలని సూచించారు. పోలీస్ శాఖ వారి సూచనలు సలహాలు తీసుకొని సహకరించే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు.
